పోలాండ్ ను 7 -0 తో ఓడించిన భారత్
.jpg)
పోలెండ్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 7-0 గోల్స్ తేడాతో గెలిచింది. స్టార్ ఫార్వర్డ్స్ తుషార్ ఖాండేకర్, యువరాజ్ వాల్మీకి రెండేసి గోల్స్ చేయగా శివేంద్ర సింగ్, మన్‌ప్రీత్ సింగ్, బీరేంద్ర లాక్రా ఒక్కో గోల్ సాధించారు. ఈ విజయంతో భారత్ గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత్‌తోపాటు బెల్జియం కూడా ఏడు పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినా మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా భారత్‌కు టాప్ ర్యాంక్ దక్కింది.
గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో మలేసియాతో భారత్, జపాన్‌తో దక్షిణాఫ్రికా, కెనడాతో బెల్జియం, పోలెండ్‌తో అర్జెంటీనా ఆడతాయి. పోలెండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది.















