రష్యా లో పుతిన్ వ్యతిరేక ప్రదర్శనలు

రష్యా ప్రధాన నగరం మాస్కో లో ప్రధానమంత్రి పుతిన్ పై వేలాది మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రష్యా పర్లమ్నేతరి ఎన్నికల్లో అనేక నియమ ఉల్లంఘనలు జరుగుతున్నాయి అని నిరసన కారులు ఆందోళన చెందుతున్నారు. రష్యా పోలిస్ ల ప్రకారం సుమారు 300 మంది నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు తెలపం జరిగింది. ఎన్నికల సమయంలో అవకతవకలు జరిగాయి అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్లు ప్రధానమంత్రి పుతిన్ కి అనుకూలంగా ఓట్లు పడ్డాయి అని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేసాయి. పుతిన్ కి చెందిన యునైటెడ్ రష్యా పార్టీ సుమారు 77 సీట్లు నష్టపోయింది.