బెయిల్ స్టే పై సుప్రీంలో చండోలియ పిటిషన్

2 జి కుంభకోణంలో ప్రధాన నిందితుడు మాజీ టెలికాం శాఖా మంత్రి ఏ రాజా వ్యక్తిగత కార్యదర్శి ఆర్ కే చండోలియ తన బెయిల్ ని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం స్తేయ్ విదించడం పై సుప్రీం న్యాయస్థానం లో పిటిషన్ వేసుకున్నారు. అతని బెయిల్ పిటిషన్ ను సిబిఐ న్యాయమూర్తి స్తేయ్ విదించారు. చండోలియ బెయిల్ మంజూరు వాయిదా వేయడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.

ఈ కుంభకోణం లో ఇప్పటివరకు సుమారు ఐదుగురు ప్రధాన నిందితులకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అందులో ద్రావిడ మున్నేట్ర కలగం పార్టీ ప్రధాన సభ్యులు కుడా ఉన్నారు.